MEESEVA CENTERS UNDER LOSS | నష్టాల్లో మీ సేవ కేంద్రాలు


నష్టాలో మీసేవలు

🕬 గత పదేళ్ళ లో అన్నీ ధరలు పెరిగిన, పెరగని మీసేవ కమీషన్

🕬 నిండా ముంచిన ధరణి

🕬 ఆన్ లైన్ / ఆప్ సేవలతో మీసేవలో తగ్గిన దరఖాస్తులు

🕬 మీసేవ లో ఆదార్ సెంటర్ల తొలగింపు

🕬 కేంద్ర నిర్ణయంతో ఓటర్ కార్డు సర్వీసులు తొలగింపు

🕬 మారుతున్న కాలంతో మరిన్ని సేవలు తొలగింపుకు రంగం సిద్దం.

🕬 తప్పులు చేసేదీ నెట్ సెంటర్లు – బదనాం అయ్యేది మీసేవ నిర్వహకులు.

2012 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మీసేవలు ప్రారంబించింది, దీని నిర్వహణ ను రాష్ట్రంలో ని నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ అర్హులైన అభ్యర్థులని ఎంపిక చేసి, ట్రైనింగ్ ఇచ్చి, రాష్ట్రంలో జిల్లాల, మండల స్థాయిలో ఎన్ని మీసేవ కేంద్రాలు అవసరం అవుతాయో సర్వే చేసి దాని ప్రకారం రాష్ట్రం మొత్తం ఒకేసారి మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది.  మీసేవ ఏర్పాటులోని ప్రదాన ఉద్దేశం “పౌరుడు మీసేవలో దరాఖస్తు చేసి, ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండా, నిర్ణీత సమయంలో మళ్ళీ మీసేవ కు వచ్చి అతని సర్టిఫికెట్ తీసుకొని పోవాలి.”  మీసేవలు ప్రారంభం లో ఒడిదుకులు ఎదురైన, జిల్లా స్థాయిలో ప్రతి నెల కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయిలో మీసేవ సమీక్ష సమావేశాలు జరుపుతూ, నిర్వాహకుల ద్వారా ప్రజల స్పందన తెలుసుకొని, ప్రజలు ఏ సర్వీసులకోసం డిమాండ్ చేస్తున్నారు తెలుసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేస్తూ మీసేవలను విజయవంతంగా నడిపించారు. మీసేవ విజయాలని చూసిన కొందరు కొత్తగా తమ తమ ప్రాంతాలలో మీసేవ లు ఏర్పాటు చేయడానికి పైరవీలు మొదలు పెట్టారు.  ఊరికి ఒకటి, లేదా జనభా ప్రాతిపదికన ఒకటి కంటే ఎక్కువ మాత్రమే మీసేవల ఏర్పాటుకు కఠిన నిర్ణయాలు ఉండడంతో వారి పైరవీలు ఫలించలేదు. రాష్ట్రంలో మారిన ప్రభుత్వం, జిల్లాలు, మండలాలు, కొత్త మునిసిపాలిటీల తో అదే పైరవికారులు మళ్ళీ తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు, ఇక్కడ అందరూ గమనించాల్సింది, కొత్త మండలాలు, మునిసిపాలిటీలు  ప్రక్కనున్న కొన్ని గ్రామాలను కలుపుకొని ఏర్పాటు అయినవే తప్ప ఇక్కడ గణనీయంగా జనాభా మాత్రం పెరగలేదు. ఆ విధంగా ఇప్పటికే రాష్ట్ర మొత్తం మీసేవ కేంద్రాలు విస్తరించిఉన్నాయి.  

గత పదేళ్ళ లో అన్నీ ధరలు పెరిగిన, పెరగని మీసేవ కమీషన్

మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసినపుడు అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కమిషన్ ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు, దేశంలో GST ప్రారంభమైన తరువాత మీసేవ పైన 18% సర్వీసు టాక్స్ విదించినారు, దానిని సరి చేయడానికి మీసేవ దరఖాస్తు ధరలను పది రూపాయలకు పెంచినారు, గతంలో ఇది A కేటగిరీ 25/-, B కేటగిరీ 35/- ఉండే, అది ఇప్పుడు 35, 45 గా కొనసాగుతుంది, కానీ మీసేవ కమిషన్ లను పెంచలేదు. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో ధరలు పెరిగాయి, కరొన అన్నీ వ్యవస్థలను అతలాకుతలం చేసింది, ఎన్నో జీవితాలు ఆగమైపోయాయి, దీనికి మీసేవ నిర్వాహకులు అతీతులేం కాదు, చాలా మంది మీసేవ నిర్వాహకులు దీనికి బలి అయిపోయారు, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.  మెయిన్ రోడ్డులో దుకాణం అద్దె, కరెంటు బిల్లు, నెట్టు బిల్లు, ఆపరేటర్ కు జీతం, స్టేషనరీ కొనుగోలు, కంప్యూటర్ల మరమ్మత్తులు, చేస్తూ చాలీ చాలని కమిషన్ తో మీసేవ నిర్వహణ చాలా నష్టదాయకంగా మారింది. పదకొండు ఏళ్ల నుంచి ఇదే పనిని కొనసాగిస్తూ ఇప్పుడు కొత్త పనిలో కి వెళ్లలేకుండా, ఇది ఎవరికైనా ఇవ్వాలన్న కటినమైన నిర్ణయాలు ఉండడం, యజమాని పేరు మార్పు తదితర ప్రోసెసింగ్ క్లిష్టతరంగా ఉండడంతో మీసేవల ను వదులుకోలేక, కొనసాగించలేక చాలా మంది దుర్బర పరిస్థితులను ఎదురుకొంటున్నారు, గ్రామ స్థాయిలో 2000 నుండి 5000 లోపు, మండల స్తాయిలో 3000 నుంచి 8000 లోపు మాత్రమే ప్రస్తుతం మీసేవ నిర్వాహకులకు కమిషన్ రూపేణ అందుతుంది.    

నిండా ముంచిన ధరణి

2018 వరకు, ధరణి రాక ముందు రెవెన్యూ శాఖ కు సంబందించిన పహాని, 1b, పాత పహనీలు, కేవలం మీసేవ లో మాత్రమే లభించేది, కానీ భూమి రికార్డులు అందరికీ సునాయాసంగా అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో, ధరణి ని ఓపెన్ సైట్ గా ఏర్పాటు చేసి, పహనీలు, 1బి లు మొబైల్ లో కూడ చూసుకునే విధంగా ఏర్పాటు చేసి, మీసేవ నుంచి ఈ సర్వీసులను తొలగించారు, దీనివలన మీ సేవలకు గణనీయంగా లావాదేవీలు తగ్గిపోయాయి,  ఓపెన్ సైటు కావడంతో,  MRO ఆఫీసుల చుట్టూ పదుల సంఖ్యలో కొత్తగా నెట్ సెంటర్లు పుట్టుకొచ్చి వాళ్ళు కూడా పహనీలు, 1B లు ఇవ్వడం రిజిస్ట్రేషన్ లు చేయించడం మొదలు పెట్టారు దీనితోకూడా మీసేవలో లావాదేవీలు తగ్గిపోయాయి. నెట్ సెంటర్లు, MRO ఆఫీసు వాళ్ళు కుమ్మక్కయి చేస్తున్న అవినీతి కార్యక్రమలకు అడ్డు అదుపులేకుండా పోయింది, వాళ్ళ ఇష్టా రీతిన ధరలను నిర్ణయించి ప్రజలను దోచుకుంటున్నా అడిగే నాధుడు లేదు.

ఆన్ లైన్ / ఆప్ సేవలతో మీసేవలో తగ్గిన దరఖాస్తులు

మీసేవ లు అందరికీ సులభంగా అందాలనే ప్రభుత్వ ఆశయంతో మీసేవ కేంద్రాలకు పోటీగా ప్రభుత్వం మీసేవ సిటిజన్ లాగిన్, TApp Folio అనే ఆప్ ను ప్రజల కొరకు అందుబాటు లో తెచ్చింది, అయితే సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని గ్రామాలలో ప్రజలు ఇంకా దీనికి అలవాటు పడలేదు.  కానీ నగరాలలో ప్రజలు విరివిగా వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా నెట్ సెంటర్ల వాళ్ళు బ్రోకర్ల అవతారమెత్తి అన్నీ మేమే చేయిస్తామని వేలకు వేలు ప్రజల నుంచి దోచుకుంటున్నారు, అయిన అడిగే నాధుడులేదు, వివిద ప్రభుత్వ ఆఫీసు లో వాళ్ళను మేనేజ్ చేసుకొని తప్పుడు పేపర్లను అప్లోడ్ చేసి వివిద రకాల దృవీకరణ పత్రాలను ప్రజలకు అందిస్తూ అవినీతికి బాటలు వేసుకున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు అయ్యే వాటిని వివిద కారణాలతో ఆలస్యం చేయడం, రిజెక్ట్ చేయడం చేస్తున్న అదికారులు, ఆప్ ల ద్వారా, నెట్ సెంటర్ల ద్వారా వచ్చే దరఖాస్తులను ఎటువంటి విచారణ లేకుండానే దృవీకరణ పత్రాలు ఇస్తున్న సంఘటనలు రోజు వస్తున్నాయి.  ప్రస్తుతం MRO ఆఫీసులలో VRO, VRA లు లేరు ఇలా వచ్చే  దరఖస్తులను విచారించడం కూడా ఉన్నతాదికారులకు చాలా కష్టమైన పని.  తప్పుడు వ్యక్తులు, తప్పుడు దృవీకరణ పత్రాలు తీసుకొనే వెసులుబాటు దీనిలో ఉన్నందున,  మీసేవ కేంద్రాల ఉనికికే ప్రశ్నార్థకరంగా మారిన ఈ సిటిజన్ లాగిన్, ఆప్ ల కొనసగింపు పై ప్రభుత్వం పునరాలోచించాలి.

మీసేవ లో ఆదార్ సెంటర్ల తొలగింపు

ఆదార్ సర్వీసులు గ్రామ స్థాయి లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని 2013 లో మీసేవ కేంద్రాలలోనే మండలానికి ఒకటి చొప్పున ఆదార్ సెంటర్ లను ఏర్పాటు చేశారు, ఇవి కూడా నిర్వాహకులకు ఏళ్ల తరబడి కమిషన్ చెల్లించకుండా, ప్రతి తప్పుకు జరిమానాలు విదిస్తూ నిర్వాహకులకు అసలు కమిషన్ నే పంచకుండా చాలా ఇబ్బందులు పెట్టారు, అయిన ఎంతో కస్టపడి కేంద్రాలను నిర్వహిస్తున్న, తరువాయి ప్రభుత్వ ఆఫీసులోనే ఆదార్ కేంద్రం ఏర్పాటు చేయాలని, లేకుంటే వదులుకోవాలని చెప్పి, తీర ప్రభుత్వ ఆఫీసులలో వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేశాక మళ్ళీ నిబందనలు మార్చి మొత్తం ఆదార్ కేంద్రాలనే ఎత్తివేశారు. దీనితో కూడా కొంతమంది మీసేవ నిర్వాహకులు చాలా నష్టపోయారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఆదార్ సెంటర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మీసేవ నిర్వహకునికి కనీసం ప్రజల మొబైలు నెంబర్ అప్డేట్ చేసే అవకాశం, అడ్రస్ మార్చే అవకాశం ఇచ్చిన ప్రజలకు చాలా వినియోగ కరంగా ఉండేది, కానీ ప్రభుత్వం, ఆదార్  శాఖ వాళ్ళు అంతా విశాల హృదయంతో ఆలోచించడం లేదు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 

కేంద్ర నిర్ణయంతో ఓటర్ కార్డు సర్వీసులు తొలగింపు

2014 లో ఓటర్ PVC కార్డులను మొదలు పెట్టిన ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో, మీసేవలలో ఓటర్ PVC కార్డులను అందుబాటులోకి తెచ్చారు. 75 వేల రూపాయల  విలువైన ఈ ప్రింటర్ లను ఇందుకోసం అదనంగా కొనుగోలు చేయవలసి వచ్చింది, ఇది నిర్వహకులకు అదనపు భారంగా ఉన్న, అవకాశమున్న కొంతమంది మీసేవ నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా దీనిని కొనుగోలు చేశారు.  ఓటర్ కార్డు నెంబర్ చెప్పగానే కార్డు ప్రింట్ ఇవ్వడం తో ప్రజలు విరివిగా దీనిని వినియోగించుకున్నారు, మారిన ప్రభుత్వాల నిర్ణయంతో ప్రస్తుతం ఈ సర్వీసు కూడా మీసేవ నుంచి తొలగించారు.  75 వేల రూపాయలతో కొనుగోలుచేసిన ప్రింటర్లు ఇప్పుడు ఇతర ఏ సేవలకు పనికి రాకుండా దుమ్ము పట్టి పోతున్నాయి, దీనికి నష్ట పరిహారంగా ఏమైనా ఇప్పించాలని కోరిన స్పందించే వారు లేరు. మీ సేవ నిర్వాహకులకు ఇదో అదనపూ నష్టం, ప్రజలకు కూడా వోటర్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మారుతున్న కాలంతో మరిన్ని సేవలు తొలగింపుకు రంగం సిద్దం.

వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రజల అవసరాలు, వాటిని తీర్చుకునే సాదనలు మారుతున్నాయి, స్మార్ట్ ఫోన్ చేతిలో కొచ్చాక ప్రతి మనిషి ఒక కంప్యూటర్ ను చేతిలో పెట్టుకొని తిరుగుతున్నట్టే.  మొబైల్ రిచార్జ్ లు, కరెంట్ బిల్లులు, బస్, రైలు, ఫ్లయిట్ టికెట్ బుకింగ్ లు ఇప్పుడు ఎవరికి వారే తమ ఫోన్లోనే చేసుకుంటూనారు, ఇది గమనించిన ప్రభుత్వం, ప్రభుత్వ సేవలను కూడా ప్రజల చేతిలోకే తేవాలన్న ఉద్దేశంతో TApp Folio, సిటిజన్ లాగిన్ ని తీసుకోవచ్చింది, తద్వారా మీసేవ కేంద్రాలలో లావాదేవీలు తగ్గుతాయని అంచనా వేసి కొత్త మీ సేవ కేంద్రాలను ఇక ముందు ఏర్పాటు చేయకూడదని 2019 లో నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం, మునిసిపల్, పంచాయతీ, రిజిస్ట్రేషన్, ధరణి, ఆదార్, ఓటర్ ఐడి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆర్ టి సి, తదితర సేవలన్నీ ఓపెన్ సైట్ ల ద్వారా, మొబైల్ ఆప్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకోవచ్చింది ఇవన్నీ కూడా మీసేవ కేంద్రాల ఉనికికే ప్రమాదంగా మారినాయి. భవిష్యత్ లో ప్రతి సర్వీసు ప్రభుత్వ ఆఫీసు కు వెళ్ళకుండా, మీసేవ కేంద్రానికి వెళ్ళకుండా, ప్రజలు తమ ఇంటి నుంచే, మొబైల్  నుంచే చేసుకొనే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.

తప్పులు చేసేదీ నెట్ సెంటర్లు – బదనాం అయ్యేది మీసేవ నిర్వహకులు.

ధరణి ఇప్పటికీ చాలామంది కేవలం మీసేవ కేంద్రంలో లోనే జరుగుతుందనే అపోహలో ఉన్నారు, అది ఎవరయినా ఎక్కడి నుంచి అయిన చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినది, ఈ విషయంలో అవగాహన లేని కొందరు అధికారులు మీసేవ నిర్వహకులను పిలిచి సంజాయిషీ అడిగిన సందర్బాలు ఉన్నాయి. సరి అయిన అవగాహన, విషయ పరిజ్ఞానం, తర్ఫీదు లేని నెట్ సెంటర్ వాళ్ళు చేసిన దరఖాస్తు ద్వారా జరిగే తప్పిదాలను మీసేవ నిర్వాహకులకు అంటగట్టే ప్రయత్నం అక్కడక్కడా జరగుతుంది.  ప్రజలు తమ కు కావాలనసిన ప్రభుత్వ సేవలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవ నిర్వాహకుల ద్వారనే చేసుకోవాలని, ప్రైవేటు నెట్ సెంటర్ లకి వెళ్ళి మోసపోవద్దని మీసేవ నిర్వాహకులు కోరుతున్నారు.

#MEESEVA #tsmeeseva #tsts #tmoa

Post a Comment

Previous Post Next Post