రాయగిరి కమాన్ చరిత్ర.
హైదరబాద్ - వరంగల్ హైవే నుంచి వెళుతునప్పుడు, యాదగిరిగుట్టకు రమ్మని స్వాగతం పలుకుతూ ఒక కమాన్ (వైకుంఠద్వారం) రాయగిరి దగ్గర ఠీవిగా దర్శనమిస్తుంది. కాసేపు ఆగి చూస్తే దాని చరిత్ర తెలుస్తుంది.
దీని నిర్మాణం 05-11-1971 మొదలయ్యి, 05-08-1972 లో ప్రారంభమయినట్టు అక్కడి శిలాఫలకం ద్వారా అర్థమవుతుంది. దీనిని శ్రీ సాయిబాబా ఫ్రూట్ కంపనీ, జాంబాగ్ రోడ్, హైదరాబాద్ కు చెందిన చగన్ల సత్యనారాయణ, చగన్ల బాలకిషన్, చగన్ల ప్రభు లాల్, చగన్ల రఘునందన్ లు నిర్మించినట్టు, దీనిని డి.కృష్ణ PWD కాంట్రాక్టర్ హైదరాబాద్ పనులను సూపర్ వైజ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి వారు పెట్టిన పేరు "యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వైకుంఠ ద్వారం".
గతంలోని పట్టణంలోని వైకుంఠద్వారం, చెక్పోస్ట్ కమాన్, కొండపైన అద్దె గదులు చాలా వరకు హైదరాబాద్ వ్యాపారస్తులే నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అదంతా గడిచిన చరిత్ర. కానీ యాదగిరిగుట్ట కు వచ్చే అత్యదిక భక్తులు హైదరాబాదు నుంచే కావడంతో హైదరాబాద్ కు యాదగిరిగుట్ట కు తరతరాలుగా అనుబందం కొనసాగుతూ వస్తుంది.