యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు దేవస్థాన పాలన లో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తునట్టు స్థానికంగా చర్చ నడుస్తుంది. బ్రహ్మోత్సవాలలో పాలన పగ్గాలు చేపట్టిన ఆయన మొదట్లో మౌనంగా కనిపించిన, బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులు సేద తీరాదనికి షెడ్ నిర్మాణం చేయించడం, కొండపైన దుకాణాలలో ధరల బోర్డులు పెట్టించడం, భక్తులకు మంచినీటి సౌకర్యం, క్యూ కాంప్లెక్స్ లో సాదారణ భక్తుడిగా వెళ్ళి భక్తుల సమస్యలు తెలుసుకోవడం, భక్తులతో నేరుగా మాట్లాడం, యాదగిరిగుట్ట మెట్ల మార్గంలో నడిచి అక్కడి సమస్యలు తెలుసుకోవడం అన్నీ దేనికి అవే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఈ రోజు కార్యనిర్వహణాధికారి గారు ఘాట్ రోడ్డు మార్గం గుండా స్వయంగా కాలినడకన కొండ క్రింద గల వ్రత మండపంకు వెళ్ళడం, మార్గమధ్యలో పరిసరాలను పరిశీలించడం, భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేస్తున్న మైకులను మరియు లైటింగ్ పనులను పరిశీలించడం భక్తుల చేత ప్రశంసలు అందుకుంటుంది.
#yadadri #yadagirigutta
Tags
Temple News