చీకట్లో యాదాద్రి మెట్ల దారి | Yadadri Steps Way in Dark

చీకట్లో మెట్ల దారి

చీకట్లో వైకుంఠ ద్వారం, పరిసరాలు

నామ్ కె వాస్తే అక్కడక్కడ  లైట్లు

పాదాచారులకు కనిపించని మెట్లు

కూర్చొని కి సౌకర్యాలు కరువు

నీళ్ళు లేక ఎండి పోతున్న పచ్చదనం

మురుగుతో పత్తాలేని పరిశుభ్రత.

కృష్ణ శిలతో పునర్నిర్మాణం జరిగి ఆలయం ప్రారంభమై రెండు సంవత్సరాలు కావస్తుంది, రానున్న పది రోజుల్లో రెండో బ్రహ్మోత్సవం కూడా జరపటానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పునర్నిర్మాణ పనులు ఇంకా కొన్ని అసంపూర్తి గా ఉండడం తో భక్తులకు సరిపడా సౌకర్యాలు లేక వివిద సందర్బాలలో అధికారులు విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. 

గతంలో కొండపైకి దాదాపుగా మూడు మెట్ల దారులు ఉండేవి, గాంధీనగర్ నుంచి పాదాల మెట్ల దారి, వైకుంఠద్వారం నుంచి ఒక మెట్ల దారి, అక్కడి నుంచే ఎడమ వైపు వైభవేష్టి మెట్ల దారి ఉండేది. దాదాపు ఇవన్నీ రాతి కడీల తో పటిష్టమైన నిర్మాణంతో, ప్రక్కనుంచి పచ్చని ఎత్తైన చెట్లతో, మద్య మద్యలో సేద తీరనికి బెంచీ ల నిర్మాణం, మద్యలో విమానం ఆకారంలో ఒక వీవ్ పాయింట్ తో సౌకర్యవంతం గా ఉండేది. ఆలయ పునర్నిర్మాణం పేరుతో ఆ మెట్ల దారులన్నీటిని తొలగించారు.


ప్రస్తుతం కేవలం ఒక దారి ని మాత్రమే నిర్మించారు. ఎక్కడా కూర్చొని సేద తీరే అవకాశం లేదు, మెట్లకు ఇరువైపు గోడలు నిర్మించడంతో కనీసం ప్రక్కన ఉన్న బండల పై కూర్చొనికి కూడా అవకాశం లేదు. గతంలో నిర్మించిన బెంచీలు, విమానం ఇంకా ఉన్నా, వాటి దగ్గరికి చేరుకునే మార్గం కూడా లేకుండా అయింది. మెట్ల గోడలకు కనీసం సున్నం వేయలేదు, ఎలక్ట్రిక్ పనుల కోసం తవ్వినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మెట్ల దారి ప్రక్కనుంచే కొండ మీది నుంచి వచ్చే మురుగు ప్రవహిస్తూ దుర్గంధ భరితంగా, చెత్త చెదారంతో ఉంది, మెట్ల ప్రక్కన నాటిన చెట్ల ను పట్టించుకున్నట్టు లేదు, ఎండి పోయి కనిపిస్తున్నాయి. 

రాత్రి పుట సరి అయిన లైటింగ్ ఏర్పాట్లు లేక కొన్ని చోట్ల కటిక చీకటి ఆవరించి ఉంది, మరి కొన్ని చోట్ల మసక మసక వెలుగు ఉంది, ఆ చీకట్లో మెట్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు, భక్తులు మొబైలు లైటు వేసుకొని వెళ్ళడం కనిపించిది. పాత మెట్ల దారి కి ఉన్న పాత స్తంభాల పైనే లైట్లు పెట్టారు, అయితే మారిన కొత్త మెట్ల కు అనుగుణంగా కొత్త స్తంభాలు, లైటింగ్ ఏర్పాటు చేయవలసి ఉన్న ఆ పనులను ఇంత వరకు మొదలు పెట్టలేదు. దూరం నుంచి చూసినా కొండకు ఒక నెక్లస్ ఆకారంలో ఆకర్షణీయంగా లైటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశమున్న నిర్వాహకులు ఆలోచించిన్నట్టు కనిపించడం లేదు.  

యాదగిరిగుట్ట కు ఒక ఐకానిక్ గా, యాదగిరిగుట్ట కు వచ్చే వారికి స్వాగతం చెబుతున్నట్టు ఉండే వైకుంఠ ద్వారం చెంత లైటింగ్ లేదు, గోపురం బయట, గోపురం లోపల కూడా మొత్తం చీకటి గా ఉంది. మెట్ల మార్గంలో వెళ్ళే వారికి చీకట్లోనే నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. పూర్తిగా కొండ ఎక్కిన తరువాత శివాలయం ప్రక్కన ఉన్న అండర్ పాస్ మెట్ల దారి లో కూడా లైటింగ్ లేక కటిక చీకటి గా ఉంది. 

ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి, మెట్ల దారిలో సరిపడా కొత్త స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని, భక్తులు సేద తీరడానికి సరిపడా సౌకరాలు కల్పించాలని,  పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో  ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.  


జానీ మహమ్మద్ 

www.manayadadri.com

https://youtube.com/manayadadri 


#yadadri #yadagirigutta #yadadritemple #telangana

 

Post a Comment

Previous Post Next Post