భువనగిరి కోట దశ మారనుందా!!
► 118 కోట్ల తో భువనగిరి కోటకు కొత్త హంగులు
► మొదటి విడత 69 కోట్ల కేటాయింపు
► కోట మీదికి రోప్ వే, లిఫ్టులు
► పచ్చని పార్కులు, నీటి కొలనులు, జలపాతాలు
► టూరిస్టులకు వసతులు, సాహస క్రీడలు
హైదరాబాదు కు అతి దగ్గరలో, రోడ్డు రైలు సౌకర్యాలతో ప్రపంచంలోనే ఏకశిల పై అతి ఎతైన ప్రదేశంలో ఉన్న భువనగిరి చారిత్రక కోట, సరి అయిన వసతులులేక, గత కొన్ని దశాబ్దాలుగా జరగాల్సినంత అబివృద్ది జరగలేదు, ప్రఖ్యాతి పొందలేదు. ప్రభుత్వాలు మారినపుడల్లా అభివృద్ది ఫైళ్ళు కదిలేవీ, సర్వేలు జరిగేవి, మళ్ళీ మూలాన పడేవి.
ఇన్నాళ్ళకు కేంద్ర ప్రభుత్వం “స్వదేశీ దర్శన్” 2.0 స్కీమ్ లోచేర్చింది. నిన్న మన ప్రధాని నరేంద్ర మోడి గారు కాశ్మీర్ నుంచి వర్చువల్ గా ఈ ప్రాజెక్టు కు శంకుస్థాన చేశారు. ఇక్కడి ప్రాంతావాసుల చిరకాల కోరిక మరి కొన్ని రోజులలో తీరబోతున్నది. ఈ ప్రాజెక్టు ను రానున్న 24 నెలలో పూర్తి చేయాలని నిర్ణయినంచినట్టు తెలుస్తుంది.
భువనగిరి ఖిలా దాదాపు 147 ఎకరాల్లో విస్తరించి, 610 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. దీనిని ఎక్కి చూడడానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంది, అది కూడా చాలా చోట్ల శిథిలవస్తాలో ప్రమాదకరంగా ఉంటుంది. అభివృద్ది లో భాగంగా కొండ పైకి మెట్ల మార్గాన్ని అభివృద్ది చేయడం తో పాటు, వరంగల్ హైవే వైపునుంచి నుంచి కొండ మీది కి రోప్ వే ఏర్పాటు చేస్తారు, అలాగే కొండకు అనుకొని పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. అన్నీ వయసుల వారు కొండ మీది కి వెళ్ళే అవకాశం వస్తుంది. వరంగల్ హైవే నుంచి కొండవరకు విశాలమైన రోడ్లు, రోప్ స్టేషన్, పార్కింగ్, వసతులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. కొండపైన పార్కులు, నీటి కొలనులు, కృత్రిమ జలపాతాలు నిర్మిస్తారు. పర్యటకులకోసం సాహస క్రీడలు, రాప్పెలింగ్, రాక్ ైక్లెంబింగ్, హైకింగ్, వాల్ ైక్లెంబింగ్ ఏర్పాటు చేస్తారు, కొండ చుట్టూరా వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
పైవన్నీ పూర్తయితే భువనగిరి కోట ఒక అద్బుత పర్యాటక ప్రదేశం గా వెలుగుపొతుంది, గతంలో చెప్పినట్టు భువనగిరి, యాదాద్రి, కొలనుపాక ను ఒక పర్యాటక సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తే, పర్యటకంగా ఈ ప్రాంతం అభివృద్ది పొందడం పాటు, ఇక్కడి ప్రజల అభివృద్ది కి కొత్త దారులు పడినట్టే. పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జానీ మహమ్మద్
https://youtube.com/manayadadri
#Bhongir #BhongirFort #Ropeway #Modi #India #Telangana #yadadri #SwadeshDarshan2.0