ముఖ్యమంత్రి కి జగ్గారెడ్డి లేఖ | LETTER TO CM BY JAGGAREDDY

 

 

యాదగిరిగుట్ట కొండపైకి పైకి ఆటో లను అనుమతించి 500 కుటుంబాలను అదుకోవాలని, సంగారెడ్డి MLA, మరియు సంగారెడ్డి జిల్లా TPCC ప్రెసిడెంట్ జయప్రకాశ్ రెడ్డి గారు సిఏం కేసీఆర్ కు లేఖ వ్రాసినట్టు, యాదగిరిగుట్ట స్థానిక ఆటో కార్మిక నాయకులు తెలియచేసారు.

 

వారు వ్రాసిన లేఖలోని అంశాలు:  

యాదగిరిగుట్ట దేవాలయం పునరనిర్మాణం తర్వాత గుట్టపైకి ఆటో లను అనుమతించడం లేదు. దింతో 500 ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 500 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదు.  అందరు ఫైనాన్స్ లో లేదా ఇంట్లో మహిళలు వడ్డీలకు తెస్తే ఆటో లు తీసుకున్నవారే.  ఇప్పుడు గుట్టపైకి ఆటో లు అనుమతించకపోవడం తో వారు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఆటో ఫైనాన్స్ లు, వడ్డీకి తెచ్చిన పైసలు కట్టలేక, ఇంటి కిరాయలు, పిల్లల ఫీజు లు కట్టుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో లను గుట్టపైకి అనుమతించాలి, ఆటో కార్మికుల సమస్యలను తీర్చాలని వారు కోరుతున్నారు. 

Post a Comment

Previous Post Next Post