యాదాద్రి జర్నలిస్ట్ రాగి సహదేవ్ కు గౌరవ డాక్టరేట్ | Yadadri Journalist Ragi Sahadev Got Doctorate


యాదాద్రి జర్నలిస్ట్ రాగి సహదేవ్ కు గౌరవ డాక్టరేట్

* జర్నలిజం. కవిత్వం.సామాజిక సేవలకు విశిష్ట గుర్తింపు
* చెన్నైలో జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం లో ' డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ' అవార్డ్ స్వీకరణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ ను ' డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ' అవార్డ్ వరించింది. చెన్నైలో 'జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ' వారు తమ 14వ స్నాతకోత్సవం లో ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసారు. ఎంపవర్ మైండ్స్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ (ఎల్ ఎల్ పి) ఫౌండర్ చైర్ విమెన్ డాక్టర్ లతా మూర్తి, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలందిస్తున్న అపిటికో లిమిటెడ్ బిజినెస్ ఆఫీసర్, రూపేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్, ఎండి డాక్టర్ కండ్ల గుంటి బాబు తదితరులు స్నాతకోత్సవ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

1981లో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఉదయం దినపత్రికలలో పత్రికా రచన (జర్నలిజం) ప్రారంభించిన రాగి సహదేవ్ అంచెలంచెలుగా ఎదిగారు. రాజధాని హైదరాబాద్ లో ఉషోదయం, కృష్ణాపత్రిక,నేటి మనదేశం, స్కైలైన్, ప్రజాపోరాటం తదితర ఆంగ్ల, తెలుగు దినపత్రికలు,పలు వార్తా సంస్థలలో స్టాఫ్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, చీఫ్ సబ్ ఎడిటర్, రెసిడెంట్ ఎడిటర్ గా నాలుగు దశాబ్దాలకు పైగా పత్రికా రచనలో నిమగ్నమై న రాగి సహదేవ్ తన వృద్ధాప్యంలో నూ యాదగిరిగుట్ట ఆంధ్రప్రభ గ్రామీణ విలేకరిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో విశాఖలో ' యాదాద్రి పత్రికారత్న ' అవార్డును ఆయన అందుకున్నారు.

'యాదగిరిగుట్ట జంటకవులు' గా ప్రసిద్ధి

స్థానిక జర్నలిస్ట్ , తెలంగాణ మాండలిక కవి చెన్నోజు ఉప్పలాచారి తో కలిపి ' యాదగిరిగుట్ట జంటకవులు ' గా ఆచార్య దివాకర్ల వెంకటావధాని చే బిరుదాంకితులైన రాగి సహదేవ్ తెలంగాణ మాండలికంలో నాటికను రచించి,ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించి పలు అవార్డులు పొందారు. ' కవితా జానపదం ' పుస్తకాన్ని వెలువరించారు. అదేవిధంగా స్థానికంగా సామాజిక సమస్యల పోరాటాలలో ఆయన భాగస్వామ్యులయ్యారు.


ప్రముఖుల అభినందనలు

ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ బోధానందగిరి స్వామిజీ, కవులు, జర్నలిస్టులు తదితరులు ఆయనను ఈ సందర్బంగా అభినందించారు.

 

Post a Comment

Previous Post Next Post