తిరుమల బ్రహ్మోత్సవాలలో తెలంగాణ జానపదం | Telangana Folk Artists performed in TTD Brahmotsavam 2023


కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తెలంగాణ మట్టి పరిమళాలు డప్పులు, బిందెల బంజారా, ఒగ్గుడోలు, ఘట విన్యాసాలు, కొమ్ముకోయ, బోనాల కోలాటం నృత్య ప్రదర్శనలతో  అశేష భక్తజనులతో నిండిన తిరుమల పురవీధులు భక్తి పారవశ్యంతో తేలియాడినయి.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా కళాకారుల బృంద నాయకుడు ఉస్తాద్ ఒగ్గు రవి మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి లో ప్రదర్శన అవకాశం రావడం గొప్ప వరమని, ఈ అవకాశం కలిపించిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖకు, తిరుమల తిరుపతి దేవస్థానముకు, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్  హరికృష్ణ మామిడి  గారికి కృతజ్ఞతలు తెలుపారు.   అలాగే,  తెలంగాణ మట్టి కలల ప్రదర్శనను విజయవంతం చేసిన డప్పు కళాకారులకు, బోనాల కోలాటం ఘట విన్యాసం ఆడబిడ్డలకు, వెన్నెల బంజారా ఆడబిడ్డలకు, కొమ్ముకోన సోదరులకు మరియు  కోడెఒగ్గులకు  ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
 Ustad Oggu Ravi

Post a Comment

Previous Post Next Post