రెండు నెలలకే
రిపెరు కొచ్చిన సిసి రోడ్డు
చాలా కాలంగా శిథిలమైన శివాజీ రోడ్డును ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సిసి
రోడ్డు ను వేయడానికి సంవత్సరం క్రితమే యాదగిరిగుట్ట మునిసిపాలిటీ నిర్ణయించిది అయితే
పనులు మాత్రం అప్పుడు మొదలు పెట్టలేదు, వివిద కారణాలతో ఆలస్యం చేస్తూ వచ్చింది. చివరికి
రాష్ట్ర ప్రభుత్వం మారిన తరువాత రెండు నెలల క్రితం మార్చి 31 న ఆర్దిక సంవత్సరం ముగుస్తుందని
ఆగమేఘాల మీద ఈ సిసి రోడ్డును మార్చి నెల ఆఖరులో వేయడం జరిగినది అది కూడా సగం వరకే రోడ్డును
వేశారు, మిగతా సగం రోడ్డు ఇంకా అసంపూర్తిగానే ఉంది. అయితే పనుల పర్యవేక్షణ చేయవలసిన
అధికారులు కమిషన్ లకు కక్కుర్తి పడి సిసి రోడ్డు నాణ్యత ను పరిశీలించలేదని ఆరోపణ లు
వినవస్తున్నాయి. ఫలితంగా సిసి రోడ్డు వర్షాలకు కంకర తేలి, దుమ్ము దూలి తో పాటు అక్కడక్కడ
గుంటలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్థానికుల పిర్యాదు
తో ఇప్పుడు రెండు నెలల క్రింద వేసిన ఆ సిసి రోడ్డును రిపేర్లు చేయడానికి పనులు మొదలు
పెట్టారు. ఇది మునిసిపాలిటీకి ఆర్దిక భారంతో పాటు ప్రజా ధనం దుర్వినియోగం అవతుందని
ఆరోపణలు వస్తున్నాయి. సిసి రోడ్డును నిర్మించే టపుడే సరి అయిన పర్యవేక్షణ జరిగే ఉంటే
బావుండేదని, ఇలా పట్టణంలో ఎన్ని పనులు నాణ్యతా లేకుండా జరగుతున్నాయో అని పౌరులు అనుమానం
వ్యక్తపరుస్తున్నారు.