One day One Crore | కోటి దాటిన యాదాద్రి ఒక రోజు ఆదాయం
byJhani Mohammed-
0
ఈ ఆదివారం 26 మే 2024 నాడు యాదాద్రి
యాదగిరిగుట్ట కు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట
పరిసరాలలో ఎటు చూసిని భక్తులు వారి వాహనలే కనిపించాయి. ఈ సందర్బంగా దేవస్థానానికి రేకార్డు
స్థాయిలో ఒక రోజు ఆదాయం ఒక కోటి పైనే సమకూరింది. దీనిలో 33 లక్షల ఆదాయం కేవలం ప్రసాద
విక్రయాల ద్వారానే లభించినట్టు ఆలయ అధికారులు తెలియచేసారు.
వేసవి సెలవుల దృష్ట్యా భక్తులు కుటుంబ సభ్యులతో భారీ సంఖ్యలో యాదగిరిగుట్ట
కు విచ్చేస్తున్నారు. గత మూడు రోజులుగా 24 నాడు, 60 వేల మంది, 25 నాడు 75 వేల మంది,
26 నాడు 81 వేలమంది స్వామి వారిని దర్శించుకునారు. ఇందుకు గాని ప్రతి రోజు సుమారు 25 నుండి 30 ఉచిత
ఆర్టీసీ బస్సులను కొండ క్రింది నుంచి మీది వెళ్ళడానికి ఆలయ అదికారులు మరియు తెలంగాణ
ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. రోజు కనీసం 26 వేల నుండి 32 వేల వరకు భక్తులను కొండ మీదికి
తరలించినట్టు అధికారులు తెలియ చేశారు.
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట,యాదాద్రి తేది: 26/05/2024 ఆదివారం శ్రీస్వామి వారి ఆదాయము రూ:- 1,02,68,099/- వివరాలు: ప్రధాన బుకింగ్ 21,58,050 /- కైంకార్యములు nill /- సుప్రభాతం 22,700 /- బ్రేక్ దర్శనం 6,81,900 /- వ్రతాలు 2,26,400 /- వాహన పూజలు 11,300 /- VIP దర్శనం 18,75,000/- ప్రచారశాఖ 35,550 /- పాతగుట్ట 1,21,720 /- కొండపైకి వాహన ప్రవేశం 9,00,000/- యాదఋషి నిలయం 3,50,860 /- సువర్ణ పుష్పార్చన 2,01,940 /- శివాలయం 15,000 /- పుష్కరిణీ 2,100 /- ప్రసాదవిక్రయం 33,32,050 /- కళ్యాణ కట్ట 2,12,500 /- శాశ్వత పూజలు 30,000/- ఆలయ పునరుద్ధణనిధి 12,000 /- లాకర్స్ 240 /- అన్నదానం 78,789 /-