యాదాద్రి లో వంద పడకల ఏరియా ఆసుపత్రి | 100 Beds Area Hospital in Yadadri


యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) ని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అబివృద్ది చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విదాన పరిషత్ నిర్ణయం తీసుకుంది, ఇందుకు సంబందించి GO No.722, dated 29-11-2022 ని విడుదల చేస్తూ, అభివృద్ది పనుల కోసం 45.79 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. 

దిన దినం అబివృద్ది చెందుతున్న యాదగిరిగుట్ట పట్టణంలో పూర్తి స్థాయి ఆసుపత్రి లేదు, అలాగే యాదగిరిగుట్ట మండలం, చుట్టూ ఉన్న రాజాపేట, తుర్కపల్లి, మూటకొండూరు మండలలోని గ్రామాలలో లో కూడా పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు లేవు, ఆసుపత్రీలు లేవు. దీనికి తోడు, యాదాద్రి ఆలయం అద్బుతంగా అభివృద్ది చెంది, భక్తల రాక కూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడి కి వచ్చే భక్తులకు అత్యవసర పరిస్థితులలో కూడా సరి  అయిన వైద్య సౌకర్యాలు అందించే అవకాశం ఇంతకాలం యాదగిరిగుట్ట లో లేదు. ఇవన్నీ విషయాలను  సి ఏం కెసిఆర్ గారు వచ్చినప్పుడు స్థానిక ఏం ఎల్ ఏ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిగారు, అలాగే స్థానిక మునిసిపల్ ఛైర్మన్ ఎరుకల సుధ మహేందర్ గారు, మునిసిపల్ కౌన్సిలర్లు సి ఏం దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగినది. ఫిబ్రవరి లో వైద్య శాఖ మంత్రి హోదాలో వచ్చిన శ్రీ హరీష్ రావు గారికి కూడా పురపాలక సంఘం తరపున శ్రీమతి సుధ మహేందర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. 


తమ వినతికి సానుకూలంగా స్పందించి యాదగిరిగుట్ట లో వంద పడకల ఆసుపత్రి కి అనుమతి ఇవ్వడం పట్ల యాదగిరిగుట్ట మునిసిపల్ ఛైర్మన్ శ్రీమతి ఎరుకల సుధ మహేందర్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావ్ గారీకి, ఆలేరు ఏం ఎల్ ఏ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి పురపాలక సంఘం పక్షాన, యాదగిరిగుట్ట ప్రజల పక్షాన  హర్షం ప్రకటిస్తూ, కృతజ్ఞతలు తెలియచేశారు.#Yadadri #Yadagirigutta

Post a Comment

Previous Post Next Post