Roja Gifts Srimalika Books to Yadadri Devasthanam

 

లక్ష్మీ నృసింహునికి  పురాణపండ "శ్రీమాలిక " సమర్పించిన  మంత్రి  రోజా

భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన  స్తోత్ర రాజాలతో, అందమైన వ్యాఖ్యానాలతో ప్రముఖ రచయిత  పురాణపండ శ్రీనివాస్ అపురూపంగా రెండు వందల నలభై పేజీలతో అందించిన,   'శ్రీమాలిక' అద్భుతగ్రంధం రెండువేల ప్రతులను యాదాద్రి పుణ్యక్షేత్ర సన్నిధానానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక, యువజన సర్వీస్ శాఖామంత్రి ఆర్కే రోజా  బుధవారం సమర్పించారు.

శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరించుకుని యాదాద్రిలో అఖండంగా నిర్వహిస్తున్న కోటికుంకుమార్చనలో పాల్గొనే ముత్తయిదువులకు కానుకగా అందించేందుకు  ఈ మంత్రమాలికను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కార్య నిర్వహణాధికారి గీతారెడ్డి కి రోజా ప్రతినిధులు బుధవారం సాయంకాలం అందజేశారు..



పవిత్ర శ్రీమాలికను ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ముఖమండపంలో అష్టోత్తర మూర్తుల వద్ శ్రీమాలిక గ్రంథాన్ని ఆవిష్కరించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు  మాట్లాడుతూ అభీష్టసిద్ధులనిచ్చే అద్భుత స్తోత్ర సంపదతో, పురాణపండ శ్రీనివాస్ రచనాసౌందర్యంతో అలరారుతున్న ఈ మంత్రరాజాల గ్రంధం ప్రతీ ముత్తయిదువ పాలిట కల్పవృక్షమని,  పరమాద్భుతమని పేర్కొంటూ మంత్రి  రోజా సౌజన్య హృదయాన్ని అభినందించారు

గురువారం నుండి కుంకుమార్చనలో పాల్గొనే మహిళలకు ఈ పవిత్రగ్రంధాన్ని కూడా సమర్పిస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి


 

#Roja #Srimalika #PuranapandaSrinivas

Post a Comment

Previous Post Next Post