Poor Arrangements at Yadadri Cultural Program


యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారి దేవస్థానానం అదికారులకు,  సిబ్బందికి గతంలొ సరస్వతి కళా మందిరంలొ దశబ్దాల పాటు విజయవంతంగా సంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమలు జరిపిన అపార అనుభవం ఉంది. యాదగిరిగుట్ట సరస్వతి కళామందిరంలొ అరంగేట్రం చేయలనే కొరిక కలిగే కళాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. యాదగిరిగుట్ట దేవస్థాన కళా ప్రాంగణంలొ ఒక్కసారైన ప్రదర్శన ఇవ్వాలనే కొరిక కల వారు చాల మంది ఉంటారు ఇటువంటి వారి అందరి కొరికలు గతంలొ ఫలించేవి. దేవస్థానం వారు కూడ ప్రతి కళకారున్ని గౌరపూర్వకంగా అవకశమిచ్చి, వారిని అతిధి మర్యదలతొ సత్కరించి, గౌరవ బహుమానాన్ని కూడ అందిచేవారు. ఏర్పాట్లు కూడ ఘనంగా చేసేవారు. ఇదంతా గతం.

గడిచిన ఏడు ఏళ్ళలొ పునర్మిణం తొ అన్ని మారిపొయాయి, కళలకు నిలయమై, కళాకారులకు అద్బుత అవకశాలిచ్చిన సరస్వతి కళా మందిరం తొలగింపుతొ గుట్ట లొ సంస్కృతిక కార్యాక్రమాలే జరగడం నిలిచిపొయింది.  దేవస్థానం అదికారులు కూడ అలవాటు మరిచిపొయినట్టున్నారు. నిన్న నరసింహా జయతి సందర్బంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు విచ్చేసిన కళకారులకు కానీ, కళాభిమానులకు కానీ, భక్తులకు, ప్రేక్షకులకు కాని ఏ మాత్రం సంతృప్తి కరంగా అనిపించలేదు. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన బుజ్జి బుజ్జి లౌడ్ స్పీకర్లను చూసి అంతా ఆవాక్కయ్యారు, అందులొని శబ్దం వినసొంపుగా లేక అందరు ఇబ్బంది పడ్డారు. దేవస్థానం అదికారులు మంచి సౌండ్ సిస్టంతొపాటు, లైటింగ్ తదితర మంచి ఏర్పాటులు చేయాలని స్థానిక కళాబిమానులు, స్థానికులు కొరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post